Prabhas Adipurush (PIC @ T series Twitter)

యావత్‌ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌.. శ్రీరాముడిగా తొలిసారి ఒక పౌరాణిక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.వాల్మీకి ర‌చించిన ఇతిహాసం రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన చిత్ర‌ం ఆదిపురుష్‌.రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుంచి క‌థ ప్రారంభం అవుతుంది.

త‌న అర్ధాంగి జాన‌కి (కృతిస‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీసింగ్‌)తో క‌లిసి స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు. లంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీఖాన్‌) త‌న సోద‌రి శూర్ప‌ణ‌ఖ చెప్పిన మాటలు విని జాన‌కిని అప‌హ‌రించి అశోక‌వ‌నంలో బంధిస్తాడు. త‌న జాన‌కిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘ‌వ ఏం చేశాడు?(Adipurush Review) త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా సాగిన ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

వీడియో ఇదిగో, ఆదిపురుష్ సినిమా బాలేదు అన్నందుకు చితకొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ మూవీ

ఓంరౌత్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ఎలా ఉందనే విషయంపై సోషల్‌ మీడియా వేదికగా.. ప్రేక్షకులు స్పందిస్తున్నారు.. రెబల్‌స్టార్‌ నటన అద్భుతం అని పొగిడేస్తున్నారు. ప్రభాస్ మరియు కృతి సనన్ హృదయాలను గెలుచుకున్నారు, ఓం రౌత్ చిత్రాన్ని 'ఎపిక్ బ్లాక్‌బస్టర్'గా అభివర్ణించారని ట్విట్టర్లో నెటిజన్లు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

ఆదిపురుష్‌ రివ్యూ ఇదిగో, హృదయాలను గెలుచుకున్న ప్రభాస్, కృతి సనన్ , ఓం రౌత్ చిత్రం 'ఎపిక్ బ్లాక్‌బస్టర్' అంటున్న నెటిజన్లు

వసవాసంతో మొదలయ్యి సినిమా ఫస్టాఫ్ బాగుంటుంది అంటున్నారు. మ్యూజిక్, బీజీఎమ్, టేకింగ్ వల్ల కొన్ని సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్ లెంతీగా ఉండటంతో కాస్త బోర్ కొడుతుందని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం కొన్ని చోట్ల VFX కుదరలేదు. తెలుగులో డబ్ చేసిన ఫీల్ వస్తుంది. భారీ సెట్టింగులు చూస్తే భారత ఇతిహాసానికి హాలీవుడ్ హంగులద్దినట్లు ఉందని పేర్కొంటున్నారు. మరికొంత మంది రాముడి పాత్రలో ప్రభాస్ యాక్షన్ సూపర్ అంటే మరికొంత మంది మాత్రం ఏదో వీడియో గేమ్ ఆడినట్టుగా ఉందని అంటున్నారు.