ఆదిపురుష్‌ రివ్యూ ఇదిగో

వాల్మీకి ర‌చించిన ఇతిహాసం రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన చిత్ర‌ం ఆదిపురుష్‌.రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుంచి క‌థ ప్రారంభం అవుతుంది.త‌న అర్ధాంగి జాన‌కి (కృతిస‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీసింగ్‌)తో క‌లిసి స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు.

వీడియో ఇదిగో, థియేటర్లో ఆదిపురుష్ మూవీని చూస్తున్న కోతి, హనుమంతుడు రాగానే ఎగిరి గంతులు, సోషల్ మీడియాలో వైరల్

లంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీఖాన్‌) త‌న సోద‌రి శూర్ప‌ణ‌ఖ చెప్పిన మాటలు విని జాన‌కిని అప‌హ‌రించి అశోక‌వ‌నంలో బంధిస్తాడు. త‌న జాన‌కిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘ‌వ ఏం చేశాడు?(Adipurush Review) త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా సాగిన ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌. ప్రభాస్ మరియు కృతి సనన్ హృదయాలను గెలుచుకున్నారు, ఓం రౌత్ చిత్రాన్ని 'ఎపిక్ బ్లాక్‌బస్టర్'గా అభివర్ణించారని ట్విట్టర్లో నెటిజన్లు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు ఇక, రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్

న‌టీన‌టులు సినిమాపై చ‌క్క‌టి ప్ర‌భావం చూపించారు. రాఘ‌వ పాత్ర‌లో ప్ర‌భాస్ (Prabhas) ఒదిగిపోయారు.జాన‌కి పాత్ర‌కి తెర‌పైన ఎక్కువ‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. అయినా స‌రే, అందులో కృతిస‌న‌న్ చాలా హుందాగా, అందంగా క‌నిపించారు. రాముడికి త‌గ్గ సీత అనిపించుకున్నారు.లంకేశ్‌గా రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ప‌తాక స‌న్నివేశాల్లో సైఫ్ అలీఖాన్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీసింగ్‌, హ‌నుమంతుడిగా దేవ్‌ద‌త్ చక్కగా నటించారు. మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు.

Twitter Reactions

సాంకేతికంగా సినిమా అత్యున్న‌త స్థాయిలో ఉంది. విజువ‌ల్ మాయాజాలం తెర‌పై క‌నిపిస్తుంది. కెమెరా,  విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాల అత్యుత్త‌మ ప‌నితీరు క‌నిపిస్తుంది. సంగీతం సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం అని చెప్పుకోవాలి.