Agent Trailer Release Date: అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చిన అయ్యగారు, ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌ చేసిన అఖిల్

ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. అందుకే వారి కోరిక మేరకు ఈ ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.

Agent Movie (PIC @AK Entertainments)

Hyderabad, April 15: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్ (Agent) కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ()Surender Reddy ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో అఖిల్ మాట్లాడగా, తాజాగా ఏజెంట్ చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో వారు ఏజెంట్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు.

ఈ చిత్ర ట్రైలర్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. అందుకే వారి కోరిక మేరకు ఈ ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో అఖిల్ (Akhil) ఓ స్పై పాత్రలో నటిస్తుండగా, ఏజెంట్ మూవీ పూర్తి స్పై థ్రిల్లర్‌గా రానుంది. ఈ సినిమాలో కొత్త బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు డీనో మోరియో కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.