TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజయ్యారు.
Newyork, July 7: అమెరికాలోని (America) ఫిలడెల్ఫియాలో తానా సభలు (TANA Sabha) అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు (Movie Celebrities) హాజయ్యారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ కార్యక్రమానికి హాజరయ్యేదుకు అమెరికా వెళ్లారు. బాలయ్యకు తానా సభ్యులు ఘన స్వాగతం పలికారు. తానా సభల అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ, కాన్ఫరెన్స్ అడ్వైజర్ జానీ నిమ్మలపూడి, సతీష్ మేక బాలయ్యకు స్వాగతం పలికారు. న్యూయార్క్ నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.
ఇళయరాజా, శ్రీలీల కూడా..
బాలకృష్ణ తో పాటు మ్యూజిక్ సెన్సేషన్, మాస్ట్రో ఇళయరాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ 23వ తానా సమావేశ వేదిక అయ్యింది. ఇక ఈ సదసస్సులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా పాల్గొంటుందని తెలుస్తోంది.