Credits: Twitter

Newyork, July 7: దగ్గుకు (Cough), తుమ్ముకు కూడా సెలవులు పెట్టేందుకు సాకులు వెతికే నేటి ఉద్యోగులు (Employees) ఉన్న ఈ కాలంలో ఓ వ్యక్తి 74 ఏళ్ల పాటు లీవ్ (Leave) పెట్టకుండా జాబ్ (Job) చేశారంటే నమ్ముతామా? అయితే, అమెరికాలోని (America) ఈ బామ్మను చూశాక నమ్మితీరాల్సిందే. దశాబ్దాల పాటు ఏకధాటిగా పనిచేసిన ఆమె ఇటీవలే 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ (Retirement) తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  మెల్బా మెబానే అనే బామ్మ1949లో టెక్సాస్‌లో మేయర్ అండ్ ష్మిడ్ స్టోర్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అప్పటికి ఆమెకు కేవలం 16 ఏళ్లు.

Fire in TSRTC Bus: టీఎస్ఆర్టీసీ రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం.. గుంటూరు సమీపంలో ఘటన (వీడియోతో)

అప్పటి నుంచి.. ఇప్పటి వరకూ

అప్పటి నుంచీ ఆమె ఉద్యోగానికే అంకితమైపోయారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్ అనే మరో సంస్థ సొంతం చేసుకుంది. కాగా, లిఫ్ట్‌ ఆపరేటర్‌గా తన ప్రయాణం మొదలెట్టిన ఆమె ఆ తరువాత దుస్తులు, కాస్మెటిక్స్ విభాగంలో ఏకంగా 74 ఏళ్ల పాటు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఉద్యోగానికి వెళ్లారు. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్నారు.  ఈ సందర్భంగా సహోద్యోగులకు ఆమెకు భారీ ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..