Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, July 7: టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సులో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ (Driver) అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఎక్స్ ప్రెస్ (Rajadhani Express) బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడ (Vijayawada) వెళ్తుండగా గుంటూరు సమీపంలో ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకున్నాయి.

Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..

మిర్రర్ లో మంటలను చూసి..

డ్రైవర్ మిర్రర్ లో మంటలను చూసి బస్సు ఆపి.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-12, ప్రయోగం సక్సెస్ అయితే పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి