John Abraham: నేను తెలుగు సినిమాల్లో నటించే ప్రసక్తే లేదు, ఇతర నటుల మాదిరిగా డబ్బు కోసం తాను నటించనని తెలిపిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం
తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం (Bollywood Hero John Abraham) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తెలుగు సినిమాలో నటిస్తున్నారనే వార్తలపై బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందించారు. తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం (Bollywood Hero John Abraham) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజా చిత్రం ఎటాక్ ఏప్రిల్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మూవీ టీంతో కలిసి జాన్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్ అబ్రహం తెలుగు, ప్రాంతీయ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మూవీ ప్రమోషన్‌లో జాన్ అబ్రహం ఆయన అప్‌కమింగ్ సినిమాలపై స్పందించాడు.
సలార్ మూవీలో ఆయన నటిస్తున్నట్టు వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు ( never do a Telugu or regional film) చేయను. నేను ఓ హిందీ హీరో. ఎన్నడు ఇతర భాషల్లో సెకండ్ హీరో, సహానటుడి పాత్రలు చేయను. ఇతర నటుల మాదిరిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటించబోయే ప్రసక్తే లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కితున్న పాన్ ఇండియా చిత్రం సలార్‌లో జాన్ అబ్రహం ఓ కీ రోల్ పోషించబోతున్నట్లు గతంలో జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
దర్శకుడు రాజమౌళిపై హీరోయిన్ ఆలియా భట్ ఫైర్, అయ్యో అన్నంత పని చేసేసిందిగా..దారుణం...
ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పఠాన్ కోసం త్వరలోనే స్పెయిన్‌కు వెళుతున్నట్లు హీరో తెలిపాడు. పఠాన్ షూటింగ్‌లో భాగంగా తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, త్వరలోనే ముంబై వచ్చి ఆ తర్వాత స్పెయిన్‌కు పయనమవుతాన్నాడు. జాన్ అబ్రహం లీడ్ రోల్‌లో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ‘ఎటాక్’ మూవీలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు