Bro Movie Trailer: పవన్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే, కామెడీ-యాక్షన్-కమర్షియల్ హంగులు అన్నీ కలబోతగా బ్రో ట్రైలర్
టాక్ ఎలా ఉన్నా పవన్ క్రేజ్‌తో తొలిరోజు హంగామా ఎలాగూ ఉంటుంది. ఒకవేళ పాజిటీవ్ టాక్ గనుక వచ్చిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు మెగా అభిమానుల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు.
Hyderabad, July 22: సరిగ్గా పది రోజులకు ఈ పాటికి బ్రో సినిమాతో (BRO) థియేటర్‌లు దద్దరిల్లిపోతుంటాయి. టాక్ ఎలా ఉన్నా పవన్ క్రేజ్‌తో తొలిరోజు హంగామా ఎలాగూ ఉంటుంది. ఒకవేళ పాజిటీవ్ టాక్ గనుక వచ్చిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు మెగా అభిమానుల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు. పైగా మామా అల్లుళ్లు కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో అందరిలోనూ తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రయూనిట్ కత్తెర పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను (BRO Triler) రిలీజ్ చేశారు. ఎప్పుడు సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వని సాయిధరమ్ తేజ్‌కు టైమ్ విలువ తెలిసేలోపు గాల్లో కలిసి పోతాడు. అప్పటికి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అదే టైమ్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దేవుడిగా వచ్చి సాయిధరమ్‌కు (Sai dharam Tej) ఓ వరం ఇస్తాడు. మరి ఆ వరాన్ని సాయి తేజ్ ఎలా వాడుకున్నాడు. అప్పటివరకు ఇంట్లో వాళ్లకి, ప్రెండ్స్‌కు టైమ్ ఇవ్వలేని హీరో.. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్లతో ఎలా టైమ్ స్పెండ్ చేశాడు. అతనింకా భూమిపై చేయాల్సిన పనులేమున్నాయి అనే కథనంతో సినిమా ముందుకు సాగుతున్నట్లు ట్రైలర్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ చూస్తుంటే మట్టుకు మెగా ఫ్యాన్స్‌కు మాత్రం పండగే అన్నట్లు ఉంది.
ఈలలు వేయించే ఫైట్స్, గోలలు చేయించే కామెడీ పుష్కలంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమైంది. పవన్ కామెడీ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా థమన్ నేపథ్య సంగీతం వేరే లెవల్లో ఉందే. ఇదే స్థాయిలో సినిమా మొత్తం ఉంటే అభిమానులకు అంతకన్నా ఏం కావాలి. పీపుల్ మీడియా సంస్థ కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ మార్క్ కూడా కనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే మాత్రం వినోదాల రైడ్‌లా అనిపిస్తుంది.
ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రదర్శితం కానుందట. నిజానికి ఇది సినిమాకు చాలా ప్లస్ అయ్యే అంశమే. ఎందుకంటే అదనంగా షోలు ప్లాన్ చేసుకోవటానికి, త్వరగా ప్రదర్శనలు పూర్తి చేసుకుని ఆడియన్స్ ఇంటికి వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ మధ్య ఆడియెన్స్ సైతం తక్కువ రన్‌టైమ్ ఉన్న సినిమాలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఇక పవన్ ఎంట్రీ సినిమా స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల తర్వాత ఉండబోతుందని ఇప్పటికే లీకైపోయింది. అంతేకాకుండా ఈ సినిమాలో దాదాపు 90 నిమిషాలు పవన్ కనిపించనున్నాడు. అంటే గంటన్నర సేపు పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడన్నమాట. నిజానికి ఒరిజినల్ వెర్షన్ సినిమాలో సముద్రఖని పాత్ర అంత సేపు ఉండదు. కానీ ఇక్కడ పవన్ క్రేజ్ దృష్ట్యా ఆయన పాత్రను పెంచినట్లు తెలుస్తుంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ వంద కోట్లు దాటిందని సమాచారం.