Chiranjeevi: ఆ మహిళ మా అమ్మకాదు, సమాజసేవలో మెగాస్టార్ తల్లి కథనంపై వివరణ ఇచ్చిన చిరంజీవి, కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ పొగడ్తలు
తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ కథనాలపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Hyderabad, April 11: కరోనాపై పోరులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనాదేవి తన వంతు సాయంగా 700 మాస్క్‌లు తయారు చేసిందని మీడియాలో పలు వార్తలు వచ్చాయి. తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ కథనాలపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
చిరు ఆచార్య సినిమాలో మహేష్ బాబు, అంతా రూమర్స్ అంటూ కొట్టిపడేసిన మెగాస్టార్
సమాజసేవలో మెగాస్టార్ తల్లి అనే న్యూస్ పేపర్ కథనంపై మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. ఆ కథనంలో ఉన్నది తన తల్లి అంజనా దేవి (Anjana Devi) కాదని, కానీ ఈ ఆపత్కాల సమయంలో ఆమె చేస్తున్న పనికి ఎంతో ముగ్ధుడినయ్యానని చిరంజీవి ట్విట్టర్ (Twitter) ద్వారా వివరణ ఇచ్చారు. లీకయిన చిరంజీవి కొత్త సినిమా లుక్, ఎర్రకండువాతో దుమ్మురేపుతోన్న మెగాస్టార్
మానవతా ధృక్పధంతో తన తల్లి ఈ పని చేశారంటూ పలు మీడియా ఛానెళ్లలో వచ్చిందని అయితే ఆమె తన తల్లి కాదని చిరంజీవి తెలిపారు. ఆమె ఎవరైనా… ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు.
Here's Chiranjeevi Konidela Tweet
కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ ట్వీట్ చేశారు. కాగా హీరో రామ్ గురించి కూడా ఒక జాతీయ పత్రికలో కథనం రావడంతో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కరోనా ఎఫెక్ట్, చిరంజీవి సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా
ఇప్పటికే మెగాస్టార్ సినీ కార్మికుల కోసం కోటి రూపాయులు సాయం చేశారు. రామ్ చరణ్ కూడా కరోనా కోసం తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళం అందించాడు. ఈ నేపథ్యంలో అంజనా దేవి కూడా తన వంతు సాయం చేస్తున్నారనే వార్త పేపర్‌లో రావడంతో ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే, ఈ వార్తలో నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.