Chiranjeevi On Konda Surekha: అసత్య ఆరోపణలు సరికాదు..వార్తల్లో నిలిచేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా?, చిరంజీవి ఫైర్

సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖల పేర్లు వాడుకుంటున్నారు... దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు చిరంజీవి. అసత్య ఆరోపణలు చేయడం దారుణం.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు అని సూచించారు.

Chiranjeevi, Nani slams Minister Konda Surekha(X0

Hyd, Oct 3:  మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు హీరో చిరంజీవి. సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖల పేర్లు వాడుకుంటున్నారు... దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు చిరంజీవి. అసత్య ఆరోపణలు చేయడం దారుణం.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు అని సూచించారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాని. తాము ఏం మాట్లాడినా త‌ప్పించుకోవ‌చ్చ‌ని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖ‌త్వ‌మే అవుతుందని..ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు అన్నారు.ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు....సమాజానికి చెడుగా  ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలన్నారు నాని.  సారీ చెప్పిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్, స్వయం శక్తితో ఎదిగిన సమంత అంటే గౌరవం ఉందని ప్రకటన

Here's  Chiranjeevi Tweet:

అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అని తెలిపారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని వెల్లడించారు.

Here's Nani Tweet:



సంబంధిత వార్తలు