Hyd, Oct 3: అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మంత్రి కొండా సురేఖ. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అని తెలిపారు.
Here's Konda Surekha Tweet:
నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు.
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024
నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు అని వెల్లడించారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం అని పేర్కొన్నారు సురేఖ.
Here's Konda Surekha tweet:
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024