Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

Chiranjeevi-Pawan Kalyan (Credits: X)

Vijayawada, Sep 2: ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (Happy Birthday Pawan Kalyan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్‌ కి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. పవన్‌ లాంటి (Pawan Kalyan) నేత ఏపీ ప్రజలకు కావాలని చిరు(Chiranjeevi) పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణిస్తూ.. అంచెలంచెలుగా ఆయన ఎదగాలని ఆకాంక్షించారు.

ఒకే వేదిక‌పై చిరంజీవి, బాల‌కృష్ణ‌, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ రెండు పిల్ల‌ర్లు ఒకే చోట అంటూ ఫ్యాన్స్ పండుగ (వీడియో ఇదుగోండి)

చిరు ట్వీట్ లో ఏం అన్నారంటే?

కళ్యాణ్ బాబు...

ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.

ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,

కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో

పెను మార్పులు తీసుకురావడానికి

వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.

 

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.

అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.

పుట్టిన రోజు శుభాకాంక్షలు

దీర్ఘాయుష్మాన్ భవ!

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త మూవీ గ్లింప్స్ రిలీజ్ వాయిదా, ప‌వన్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్, OG పోస్ట‌ర్ రిలీజ్ చేసిన డీవీవీ 



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

Pushpa 2 Success Meet: ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అల్లు అర్జున్, స‌క్సెస్ మీట్ లో ప‌వ‌న్ పేరు ఎత్త‌గానే క్రేజ్ మామూలుగా లేదు