Dil Raju Covid: టాలీవుడ్‌లో కరోనా సెకండ్ వేవ్ అలజడి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్యలకు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే నివేతా థామస్‌కు కరోనా పాజిటివ్, స్వీయ నిర్భంధంలోకి దిల్ రాజు
ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా భారీన పడగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా (dil-raju-tested-covid-positive) నిర్దారణ అయ్యింది. దీంతో ఈ అగ్ర నిర్మాత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
తెలుగు చిత్ర సీమను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా భారీన పడగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా (dil-raju-tested-covid-positive) నిర్దారణ అయ్యింది. దీంతో ఈ అగ్ర నిర్మాత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ ఏప్రిల్ 9న దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'వకీల్‌సాబ్' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌తో దిల్‌రాజు బిజీగా ఉంటూ వచ్చారు. ఇప్పటికే 'వకీల్‌సాబ్' యూనిట్‌లో నివేతా థామస్‌కు కరోనా పాజిటివ్ అని తెలిసి ఆమె హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.
తర్వాత పవన్‌కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుగానే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో 'వకీల్ సాబ్' (Vakeel Saab) యూనిట్‌లో కంగారు పడుతుంది. రీసెంట్‌గా దిల్‌రాజు..మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. దీంతో మెగా ఫ్యామిలీలోనూ కరోనా భయం పట్టుకుంది. 'వకీల్‌సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజులుగా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్‌రాజుతో కలిసి తిరుగుతున్నారు.ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారని సమాచారం.
ఈ క్రమంలో ఈ మధ్య తనను కలిసిన వారందరూ వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలని దిల్‌రాజు కోరారు. తెలుగు చిత్ర సీమలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రీసెంట్‌గా దర్శకుడు వి.ఎన్.ఆదిత్యతో పాటు మరో ఇద్దరు నిర్మాతలకు కూడా కరోనా సోకినట్లు సమాచారం.
ఇటీవల నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్‌లు కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్మాత ‘దిల్’ రాజుతో పాటుగా దర్శకులు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్య పేర్లు చేరాయి. ‘దిల్’ రాజుకు కరోనా లక్షణాలు లేవు. కానీ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని సోమవారం పొద్దు పోయాక తెలిసింది.
గతవారం ఓ స్టూడియోలో పవన్‌కల్యాణ్ – హరీశ్ శంకర్ కొత్త చిత్రం ఫోటోషూట్ జరుగుతుంటే, అక్కడకు వెళ్ళి పవన్‌కల్యాణ్‌ను రాజు కలిశారు. ఆ పక్కనే స్వీయ సమర్పణలో షూటింగ్ జరుగుతున్న ‘శాకుంతలం’ సెట్స్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే పవన్ కల్యాణ్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్ళారు. ఆలస్యంగా పాజిటివ్ అయిన గుణశేఖర్ కూడా క్వారంటైన్ బాట పట్టారు. దాంతో, ‘శాకుంతలం’ షూటింగ్ (shakuntalam shooting postponed) కొన్నాళ్ళు ఆగనుంది. మరోపక్క ఈ నెల 23న రిలీజు కావాల్సిన నాని ‘టక్ జగదీశ్’ సైతం తెలుగు నేలపై కరోనా కలకలంతో వాయిదా పడింది.