Most Searched Movies 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవిగో, టాప్ ప్లేస్‌లో షారుక్‌ కాన్ జవాన్

తాజాగా 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధిక వెతికిన టాప్‌-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది

Jawan Prevue (Photo Credits: YouTube)

Most Searched Movies On Google In 2023: ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ 2023 సంవత్సరంలో ఎవరెవరు ఏమేమీ వెతికారు? ఏ అంశాల గురించి సెర్చ్‌ చేశారనే విషయాలను వరుసగా వెల్లడిస్తున్నది. తాజాగా 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధిక వెతికిన టాప్‌-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది షారుక్‌ నటించిన రెండు సినిమాలు జవాన్, పఠాన్ టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితోపాటు సైలెంట్‌గా విడుదలై సంచలనం సృష్టించిన గదర్‌-2, ది కేరళ ఫైల్స్‌ కూడా ఈ జాబితాలో నిలిచాయి.

సలార్ ఫస్ట్‌ సింగిల్‌ సూరీడే సాంగ్ అప్‌డేట్ ఇదిగో, తన స్నేహితుడు చేయి పట్టుకుని సలార్ తీసుకువెళుతున్నట్లుగా సాంగ్

పాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌, సల్మాన్‌ఖాన్‌ నటించిన టైగర్‌-3, కూడా టాప్‌-10లో నిలిచాయి. ఇక చాలా రోజుల తర్వాత రజినీకాంత్‌కు బంపర్‌ హిట్‌ ఇచ్చిన జైలర్‌, దళపతి విజయ్‌ నటించిన లియో, వారిసు సినిమాలు కూడా టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి.

గూగుల్‌ ప్రకటించిన టాప్‌-10 మూవీస్‌ ఇవే..

1. జవాన్‌

2. గదర్‌-2

3. ఓపెన్‌హైమర్‌

4. ఆదిపురుష్‌

5. పఠాన్‌

6. ది కేరళ స్టోరీ

7. జైలర్‌

8. లియో

9. టైగర్‌-3

10. వారిసు

టాప్‌-10 ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు/ ట్రెండింగ్‌ షోస్‌

1. ఫర్జీ

2. వెడ్‌నెస్‌ డే

3. అసుర్‌

4. రానా నాయుడు

5. ది లాస్ట్‌ ఆఫ్‌ అస్‌

6. స్కామ్‌ 2003

7. బిగ్‌బాస్‌ 17

8. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

9. సెక్స్‌/లైఫ్‌

10. తాజా ఖబర్‌