డార్లింగ్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే (Sooreede) సాంగ్ అప్‌డేట్ అందించారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సూరీడే లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. సలార్ తన స్నేహితుడు వరదరాజ మన్నార్ చేయి పట్టుకుని.. తీసుకెళ్తున్నట్టుగా ఉన్న సాంగ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ పోషిస్తున్న వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Here's Update
First Single from #SalaarCeaseFire out tomorrow 🎵#SalaarFirstSingle: #Sooreede (Telugu), #SoorajHiChhaonBanke (Hindi), #AakaashaGadiya (Kannada), #Suryangam (Malayalam), #AagaasaSooriyan (Tamil).
Music by @RaviBasrur 🎶#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/0iYnnrTZs8
— Salaar (@SalaarTheSaga) December 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)