Rajamouli and Mahesh Babu Movie : మహేష్ కోసం విలన్‌ గా మారుతున్న టాలీవుడ్ స్టార్ హీరో, క్రేజీ కాంబో సెట్ చేసిన జక్కన్న, మహేష్ బాబు కోసం రంగంలోకి తమిళ్ స్టార్ హీరో

ఈ మూవీ ఇంకా ముహుర్తం కూడా పెట్టుకోకముందే, కాస్టింగ్ పై ఊహాగానాలు వస్తున్నాయి. దీని గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా మహేశ్‌ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి.

Rajamouli Mahesh Babu (Photo-Facebook)

Hyderabad Feb 04: సూపర్‌ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో రాబోయే కొత్త మూవీపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ ఇంకా ముహుర్తం కూడా పెట్టుకోకముందే, కాస్టింగ్ పై ఊహాగానాలు వస్తున్నాయి. దీని గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా మహేశ్‌ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ కానీ.. మహేశ్‌ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli)కానీ స్పందించడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ఈ మధ్యే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra prasad) ఒక క్లారిటీ ఇచ్చాడు. ద‌క్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో మహేశ్‌ బాబు సినిమా తెరకెక్కబోతుందని ఆయన చెప్పాడు.

ఇప్పటి వరకు మహేశ్‌ బాబు, రాజమౌళి సినిమా సింగిల్ స్టారర్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ట్రిపుల్‌ ఆర్ తరహాలో ఇది కూడా మల్టీస్టారర్ అని ఇప్పుడు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తెలుగు (Telugu)లో కాదు తమిళం నుంచి ఒక స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆయన ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే కచ్చితంగా మహేశ్‌ బాబుతో పాటు మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో.. ఇండియన్ సినిమాలో చూడని అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా మహేశ్‌ సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.

50 రోజుల్లో రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసిన పుష్ప, సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించిన మైత్రీ మూవీస్

సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ నిర్మాణ రంగం వైపు వస్తున్నాడు. రాజమౌళి దాదాపు పదేళ్ల కింద ఈయనతో సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది తెరపైకి రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో విలన్‌గా నటించడానికి యాక్షన్ హీరో గోపీచంద్‌(Gopi Chand)ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు రాజమౌళి. కెరీర్ మొదట్లో జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు గోపీచంద్. మధ్యలో పెద్ద అవకాశాలు వచ్చినా కూడా ప్రతినాయకుడిగా నటించలేదు. మరి ఇప్పుడు రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ఆయన తీసుకుంటాడో లేదో చూడాలి. రాజమౌళి సినిమాల్లో విలన్‌ అంటే ఎంత పవర్‌ ఫుల్ గా ఉంటాడో తెలుసు కదా! అందుకే గోపీచంద్ కూడా ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif