కాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’ థియేటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. అదే రేంజ్‌లో కలెక్షన్లను రాబడుతూ..2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)