Hamsa Nandini: క్యాన్సర్ పై సగం గెలిచా: హంసా నందిని, మరో పోరాటానికి రెడీ అవుతున్నా, త్వరలోనే సర్జరీలు ఉన్నాయంటూ పోస్ట్, తన ట్రీట్ మెంట్ అప్‌డేట్ ఇచ్చిన నటి
తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. అప్పటి నుంచి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.
Hyderabad, Feb 24: క్యాన్సర్ బారిన పడ్డ నటి హంసా నందిని (Hamsa nandini) గుడ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. అప్పటి నుంచి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. తన బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ కు సంబంధించి ట్యూమర్ ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారని, ఇప్పటికే తొమ్మిదిసార్లు కీమోథెరపి (chemotherapy) చికిత్స తీసుకున్నానని, ఇంకో ఏడు సార్లు కీమో థెరపీ చేయించాలని పోస్ట్ చేసింది హంసా నందిని. ఇలా సడెన్ గా సినిమాలకి దూరమై చాలా రోజుల తర్వాత క్యాన్సర్ అంటూ పోస్ట్ పెట్టడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆందోళనకి గురయ్యారు. అప్పటినుంచి కూడా తను క్యాన్సర్ చికిత్స చేయించుకుంటూ ఉంది. తాజాగా మరోసారి తన క్యాన్సర్ చికిత్స గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన ప్రస్తుత ఫోటోలని షేర్ చేసి తన పరిస్థితిని తెలుపుతూ.. ”మొత్తం 16సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి అవ్వలేదు. నేను ఇంకా గెలవలేదు. నా నెక్స్ట్ పోరాటానికి నేను రెడీ అవ్వాల్సిన సమయం ఇది. నా సర్జరీలకు సమయం దగ్గరపడింది.” అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని, మంచి జరగాలని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్పెషల్ సాంగ్స్ చేసిన హంసానందినికి క్యాన్సర్ రావడంతో సినిమాలకి దూరమయింది. కొద్దికాలం క్రితం ఆమె సడెన్ గా తనకు క్యాన్సర్ సోకిందని, కీమో జరుగుతోందని గుండుతో ఉన్న పోస్టు చేసింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ప్రస్తుతం సగానికి పైగా ట్రీట్ మెంట్ విజయవంతంగా అయిపోయినట్లు పోస్ట్ చేయడంతో...ఫ్యాన్స్ ఆమెకు మరింత ధైర్యం చెబుతున్నారు.