Bheemla Nayak Pre-Release Business: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ టోటల్ బిజినెస్ 110 కోట్లు, వామ్మో రిలీజ్‌కు ముందే రిస్క్ తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు
(Image: Twitter)

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి. 2022 ఇయర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఫస్ట్ టాప్ స్టార్ మూవీ ఇదే అవ్వడంతో అంచనాలు ఆల్ రెడీ భారీగా పెరిగి పోగా… పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఆల్ రెడీ బిగ్ హిట్ గా నిలవడంతో కామన్ ఆడియన్స్ లో కూడా అంచనాలు ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా ఓవరాల్ గా జరిగింది అని చెప్పాలి.. బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ రీసెంట్ మూవీ వకీల్ సాబ్ కేవలం 2 వారాల రన్ కే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని పీక్ సెకెండ్ వేవ్ టైం లో సొంతం చేసుకోగా ఆ సినిమా కి మించిన బిజినెస్ ను ఇప్పుడు భీమ్లా నాయక్ సొంతం చేసుకుంది.

వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా చాలెంజ్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వ సలహాదారు

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు చేరుకుందట. నైజాం హక్కులను సొంతం చేసుకోవడానికి దిల్ రాజు దాదాపు ₹35 కోట్లు ఆఫర్ చేశాడట. అలాగే మరికొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర హక్కులను మొత్తం 53 కోట్లకు కొనుగోలు చేశారట.

అదే సమయంలో, ఇతర రాష్ట్రాల హక్కులు 9 కోట్లకు పలికాయట. ఓవర్సీస్‌లో మరో 9 కోట్లకు విక్రయించారట. ఓవరాల్‌గా, బిజినెస్ దాదాపు 105-107 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌కు 100 కోట్ల షేర్ మార్క్ చిత్రమనే చెప్పాలి. గతంలో వచ్చిన వకీల్ సాబ్ కరోనా మహమ్మారి కారణంగా థియేటర్‌లలో పెద్దగా రన్ కాలేదు. కానీ ఈ చిత్రం మొదటి రోజు షేర్‌లో దాదాపు 36 కోట్లు వసూలు చేసింది. ఇది పవన్ కెరీర్‌లో అత్యధిక షేర్‌గా నిలిచింది. మరి భీమ్లా నాయక్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఏరియాల వారీగా లెక్కలను ఒకసారి గమనిస్తే…

నైజాం – రూ. 35 కోట్లు

సీడెడ్ – రూ. 17 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 9.2 కోట్లు

గుంటూరు – రూ. 7.2 కోట్లు

ఈస్ట్ – రూ. 6.4 కోట్లు

వెస్ట్ – రూ 5.6 కోట్లు

కృష్ణ – రూ. 6 కోట్లు

నెల్లూరు – రూ. 3.25 కోట్లు

ఏపీ + తెలంగాణ టోటల్ ప్రీ – రిలీజ్ బిజినెస్ రూ. 89.65 కోట్లు

ఓవర్సీస్ – రూ. 9 కోట్లు

కర్నాటక, రెస్టాఫ్ ఇండియా: 9Cr

Total World Wide: 106.75CR

ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క… ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా ఇది. బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఈ కొండంత టార్గెట్ ను అందుకుని 108 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.