Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??

కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.

Sharwanand (Credits: Twitter)

Hyderabad, May 28: టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand) త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ (Accident) జరిగింది. శర్వానంద్ కు ఇవాళ తెల్లవారు జామున యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్(Hyderabad) ఫిలింనగర్ జంక్షన్ వద్ద నేడు తెల్లవారుజామున శర్వానంద్ తన రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా ఒక్కసారిగా కారు బోల్తా పడి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ లో శర్వానంద్ కి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం శర్వా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలీదు. అలాగే ఈ యాక్సిడెంట్ పై శర్వానంద్ కానీ, అతని ఫ్యామిలీ కానీ స్పందించలేదు.

New Parliament Building Inauguration Live Updates: భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మొదలైన సరికొత్త అధ్యాయం.. అట్టహాసంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం.. వీడియో ఇదిగో..

అభిమానుల ఆందోళన

వారం రోజుల్లో పెళ్లి ఉండగా ఇప్పుడు ఇలా శర్వానంద్ కు యాక్సిడెంట్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. శర్వానంద్ ఇటీవలే ‘ఒకేఒక జీవితం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.