Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. 2025 జనవరి 24న విడుదల కానున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం.. సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా

వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Credits: X

Hyderabad, September 1: టాలీవుడ్ (Tollywood), బాలీవుడ్ (Bollywood) లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్ లకు (Hrithik Roshan) ఉన్న స్థాయి, స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. వీరి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. వీరిద్దరూ కలిసి 'వార్ 2' చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్ట్ బాలీవుడ్ చిత్రంలో తారక్ నటిస్తుండటం ఇదే తొలిసారి. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ 'వార్' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'బ్రహ్మాస్త్ర' డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం 2025 జనవరి 24న విడుదలవుతోంది.

Sudheer Babu: నేను దర్శకుడిగా మారితే పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా.. హీరో సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్.. సంబరపడిపోతున్న పవర్ స్టార్ అభిమానులు

నజీర్ పాత్రలో ఎన్టీఆర్

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా నజీర్ అనే పాత్రలో ఎన్టీఆర్, కబీర్ అనే పాత్రలో హృతిక్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇదే సినిమాలో స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.

Viral Video: నడిరోడ్డుపై యువతిని పొడిచి రంకెలు వేసిన ఎద్దు.. అహ్మదాబాద్ లో ఘటన.. వీడియో వైరల్