Adipurush Pre Release Business: దిమ్మతిరిగిపోయేలా ఆదిపురుష్ బిజినెస్‌, తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు అమ్ముడుపోయిందంటే? వెయ్యికోట్లు టార్గెట్‌గా ప్రభాస్ స్కెచ్‌

ఈ ఫిగర్‌ ఆల్‌మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లే తెలుస్తుంది. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగిందంటే ప్రభాస్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనకు పరిచయమేలేని దర్శకుడు, కృతిసనన్‌ తప్పితే మిగితా వారి మోహాలు మునుపు చూసిందే లేదు.

ADIPURUSH

Hyderabad, May 28: బాహుబలితో ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌, మార్కెట్‌ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందన్న మాట వాస్తవం. ప్రభాస్‌తో సినిమా చేయాలంటే వందల కోట్లల్లో బడ్జెట్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అదే స్థాయిలో ఆయన సినిమాలు కలెక్షన్‌లు కూడా సాధిస్తుంటాయి. ఇక ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాలు సైతం వందల కోట్లల్లో వసూళ్లు రాబడుతుంటాయి. సాహో (Sahoo), రాధేశ్యామ్‌ (Radhe shaym) వంటి ఫ్లాపులు కూడా అదిరిపోయే ఓపెనింగ్స్‌ తీసుకువచ్చాయి. అంతేకాకుండా ఈ రెండు సినిమా ఫలితాలు ప్రభాస్‌ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్‌ లైనప్‌లో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో అన్నీ భారీ చిత్రాలే. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ (Adipurush) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఓం రౌత్‌ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్‌ ఓ రేంజ్‌లో ట్రోల్స్‌కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌ను తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌తో వచ్చిన నెగిటీవిటీ అంతా ట్రైలర్‌తో పటా పంచలయింది. మరో మూడు వారాల్లో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాపై యావత్‌ సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

Salaar Movie Update: సలార్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్, 400 మంది ఫైటర్లతో ప్రభాస్ క్లైమాక్స్‌ ఎపిసోడ్, సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి సలార్ 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు వీరలెవల్‌లో బిజినెస్‌ జరిగిందని తెలుస్తుంది. టాలీవుడ్‌లో వినిపుస్తున్న గుసగుసల ప్రకారం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఓ బడా నిర్మాణ సంస్థ దాదాపు రూ.160-170 కోట్ల రేంజ్‌లో ఆఫర్‌ చేసిందట. ఈ ఫిగర్‌ ఆల్‌మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లే తెలుస్తుంది. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగిందంటే ప్రభాస్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనకు పరిచయమేలేని దర్శకుడు, కృతిసనన్‌ తప్పితే మిగితా వారి మోహాలు మునుపు చూసిందే లేదు. అయినా ఈ రేంజ్‌లో బిజినెస్‌ అంటే మాములు విషయం కాదు.

Swatantrya Veer Savarkar Teaser: వీర్‌ సావర్కర్ టీజర్‌లో అదరగొట్టిన రణ్‌దీప్ హుడా, అచ్చం సావర్కర్‌ను దించేసిన బాలీవుడ్ హీరో 

ఇక్కడ కేవలం ప్రభాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ బిజినెస్‌ (Adipurush Pre Release Business) జరిగిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాకు గనుక పాజిటీవ్‌ టాక్‌ వస్తే తొలిరోజే వంద కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఏ మాత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చిన ప్రభాస్‌ మరోసారి వెయ్యి కోట్ల హీరోగా నిలవడం ఖాయం. కృతిసనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది.