రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న స్టార్ మూవీ సలార్. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ లో దాదాపు 400 మంది పాల్గొంటారని అంటున్నారు. అంటే క్లైమాక్స్ ను ఏ రేంజ్ లో చూపించనున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించు 'కేజీఎఫ్' స్థాయిలో క్లైమాక్స్ ఉంటుందని అనుకోవచ్చు. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనీ, భారీతనానికి అద్దం పడుతుందని అంటున్నారు.
బ్రో' సెట్స్ పైకి పవన్ సూపర్ ఎంట్రీ... వీడియో వైరల్
అదే జరిగితే ఇంతవరకూ ప్రభాస్ చేసిన యాక్షన్ సీన్స్ లో ఇది మొదటివరుసలో కనిపిస్తుంది. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగుకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు.