Indian 2 Intro: సంచలనాలు సృష్టించేందుకు మళ్ళీ వచ్చేస్తున్న భారతీయుడు, ఇంట్రోతోనే అదరగొట్టిన కమల్ హాసన్, తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి

తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్‌-2 ఇంట్రో రిలీజ్ విడుద‌ల చేశారు.

Indian 2 Intro (PIC@ SS RAJAMOULI X)

Hyderabad, NOV 03: తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్‌-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ఇక శంకర్‌ (Shankar) డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో కమల్‌ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వ‌స్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా వున్న‌ ‘ఇండియన్‌ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్‌-2 ఇంట్రో రిలీజ్ విడుద‌ల చేశారు. ఇక ఈ ఇంట్రోను తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) విడుద‌ల చేశాడు.

 

”ఏ తప్పు జరిగిన నేను తప్పకుండ వస్తాను భార‌తీయుడికి చావే లేదు అంటూ భారతీయుడు సినిమాలో చెప్పిన డైలాగ్‌తో ఈ ఇంట్రో మొద‌ల‌వుతుంది. అనంత‌రం. సార్ ఆరున్న‌ర ల‌క్ష‌లు మాత్రమే ఉన్నాయి. అంటే ఎనిమిది ల‌క్ష‌లు ఇస్తేనే పోస్టింగ్ అంటూ అధికారి చెప్పడంతో భారతీయుడు 2 కూడా లంచంపై ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

ఇక ఈ ఇంట్రోలో కమల్ హాస‌న్‌ (Kamal Hassan)తో పాటు, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, బ్రహ్మానందం త‌దిత‌రులు కనిపించి అలరించారు.

ఈ సినిమాను రెడ్ జెయింట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మ‌రోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్… ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.



సంబంధిత వార్తలు

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Pushpa-2 New Record: వందేళ్ల బాలీవుడ్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన పుష్ప‌, షారూక్ సినిమా కూడా సాధించ‌లేద‌ని రికార్డు సాధించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif