Kannappa: సోమవారం అప్‌డేట్ వచ్చేసింది, ముండడుగా దేవరాజ్‌, సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు

డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మంచు ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

Introducing Devaraj as Mundadu From The Crazy Pan India Film Kannappa

Hyd, Aug 5: మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మంచు ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రతీ సోమవారం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. తాజాగా ఎరుకల తెగ నాయకుడైన ముండడు అనే పాత్రకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

విజువల్ వండర్‌గా శివుని భక్తుడైన కన్నప్ప కథను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు. చివరి దశకు ఈ సినిమా షూటింగ్ చేరుకుంది. ఫిల్మ్ ఫేర్ లో తెలుగు సినిమాల‌కు అవార్డుల పంట‌, బెస్ట్ మూవీగా బ‌లగం, బెస్ట్ యాక్ట‌ర్ గా నాని, పూర్తి అవార్డుల వివ‌రాలిగో

నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా మధుబాల లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప సినిమాపై ఆసక్తి పెంచేలా ప్రమోషన్స్ చేస్తుండగా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.