Hyderabad, AUG 04: తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో (Dasar Movie) నటనకు గాను బెస్ట్ హీరోగా నాని (Nani), ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి (Venu Yeldandi) నిలిచారు. 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్-2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. కుటుంబ బంధాలను చాటుతూ చిన్న చిత్రంగా విడుదలై వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam) ఉత్తమ చిత్రంగా నిలిచింది.
TELUGU FILM ‘DASARA’ WINS 6 FILMFARE AWARDS… #Dasara achieves a clean sweep at the prestigious #FilmfareAwards, securing victories in six highly-esteemed categories.
⭐️ Best Actor: #Nani
⭐️ Best Actress: #KeerthySuresh
⭐️ Best Debut Director: #SrikanthOdela
⭐️ Best… pic.twitter.com/7qBBn515Xw
— taran adarsh (@taran_adarsh) August 4, 2024
తొలి ప్రయత్నంలోనే వేణు యెల్దండి (Venu Yeldandi) ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. బలగం సినిమాకు మరో అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా రూపలక్ష్మి అవార్డు అందుకున్నారు. ఇక ‘దసరా’లో నటనకు గానూ నాని, కీర్తి సురేశ్‌లు ఉత్తమ నటీనటులుగా, ఉత్తమ పరిచయ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఎంపికయ్యారు. మొత్తంగా ఈ రెండు సినిమాలు తొమ్మిది అవార్డులు దక్కించుకున్నాయి. ఇక ఎవరెవరికి ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం..
TELUGU FILM ‘BABY’ WINS 5 FILMFARE AWARDS… *HINDI REMAKE* IN THE WORKS… #Telugu film #Baby - one of the biggest hits of 2023 - clinched 5 #FilmfareAwards out of its 8 nominations.
⭐️ Best Film - Critics: #SaiRajesh
⭐️ Best Actress - Critics: #VaishnaviChaitanya
⭐️ Best Music… pic.twitter.com/eQCTZkJGmj
— taran adarsh (@taran_adarsh) August 4, 2024
తెలుగు విజేతలు వీళ్లే..
ఉత్తమ చిత్రం- బలగం
ఉత్తమ నటుడు- నాని (దసరా)
ఉత్తమ నటి- కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు- వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు- శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్‌నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- సాయి రాజేశ్ (బేబి)
ఉత్తమ నటి (క్రిటిక్స్)- వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు- రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి- రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు- శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని- శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్)
ఉత్తమ సాహిత్యం- అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం- విజయ్ బుల్గానిన్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ- సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- కొల్లా అవినాష్ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ- ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా.. దసరా)