Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం

మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Jr NTR (Credits: X)

Hyderabad, Sep 3: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం (Khammam), విజయవాడలో (Vijayawada) చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్‌ భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలను  విరాళంగా ప్రకటిస్తున్నట్టు ఎక్స్ లో ఎన్టీఆర్ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ట్వీట్ లో ఏమన్నారంటే?

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.  వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను’ అని జూనియర్ ట్వీట్ చేశారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ కు మ‌రో కీల‌క బాధ్య‌త‌లు?! చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో రాష్ట్ర సర్కారు