KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2
ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.
Hyderabad, November 20: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీకి సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.
ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు (KRKR)సినిమాకు సంబంధించి మొదటి ట్రైలర్ విడుదల చేసి సంచలనం రేపారు. అది అలా కొనసాగుతుండగానే కెఎ పాల్ మీద మరో పాటను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ (Kamma RajyamLo Kadapa Reddlu TRAILER 2) ని విడుదల చేశారు.
ట్విట్టర్ వేదికగా ట్రైలర్ విడుదల చేసిన వర్మ
ఈ ట్రైలర్ గత ఎన్నికలను తలపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ (AP CM YS Jagan) సీఎం అయిన తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రతిబింబించేలా ఈ ట్రైలర్ ఉంది. అలాగే ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Janasena Pawan Kalyan) ఎంట్రీని కూడా ఇందులో చూపించినట్లుగా ట్రైలర్ ని బట్టి చూస్తే తెలుస్తోంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితిని వర్మ రెండో ట్రైలర్ లో చూపించినట్లుగా తెలుస్తోంది. ఆ పొట్టోడు పార్టీని మొత్తం లాగేసుకుంటాడనే డైలాగ్ కూడా ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అయితే వర్మ (Ram Gopal Varma)మాత్రం ఈ సినిమా ద్వారా ఎవరినీ టార్గెట్ చేయడం లేదని చెప్పడం ఆశ్చర్యపరిచే అంశం.
ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు పిచ్చెక్కిపోయి ఉన్నారంటూ వర్మ వాయిస్ (Varma Voice)తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడంటూ మధ్యలో చెప్పిన డైలాగ్ ఎవరిదనేది ఆయన చెప్పకపోయినా పరోక్షంగా టీడీపీ పార్టీని ఉద్దేశించినట్లు సమాచారం.