Karan Johar Viral Reply: మీరు "గే" నా? కరణ్ జోహార్ నెటిజన్ సూటి ప్రశ్న, దిమ్మతిరిగేలా జవాబిచ్చిన కరణ్
నిజమేనా..?’ అని కరుణ్‌ను ప్రశ్నించాడు. తన అభిప్రాయాలను నిర్భయంగా బయటి చెప్పే కరుణ్ తనదైన శైలిలో అతడికి సమాధానం ఇచ్చాడు. “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Mumbai, July 09: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపుగా అందరికి అతడు సుపరిచితుడే. దాదాపు ఓ స్టార్ హీరోకు సమానంగా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన విషయాలతో పాటు సినిమాల వివరాలను పంచుకుంటూ ఉంటాడు. ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థ్రెడ్స్ (Threads) యాప్ హవా నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఇందులో తమ ఖాతాలను ప్రారంభించారు. ఇక శనివారం కరణ్ జోహార్ సైతం థ్రెడ్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులతో మాట్లాడాలని భావించారు. ‘ఆస్క్ కరణ్ ఎనీథింగ్’ సెషన్‌ను నిర్వహించారు. 10 నిమిషాల పాటు అందుబాటులో ఉంటానని తనను ఏవైన ప్రశ్నలు అడగొచ్చునని తెలిపారు. ఈ క్రమంలో పలువురు నెటీజన్లు పలు ప్రశ్నలు వేశారు. అయితే.. ఓ నెటీజన్ వేసిన ప్రశ్న అందరిని ఆశ్చర్యపరిచింది.
‘మీరు గే కదా.. నిజమేనా..?’ అని కరుణ్‌ను ప్రశ్నించాడు. తన అభిప్రాయాలను నిర్భయంగా బయటి చెప్పే కరుణ్ తనదైన శైలిలో అతడికి సమాధానం ఇచ్చాడు. “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అలియా భట్, రణవీర్ సింగ్ జంటగా నటించిన సినిమా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'(Rocky Aur Rani Kii Prem Kahaani). కరుణ్ జోహార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడు సంవత్సరాల విరామం తరువాత కరణ్ మళ్లీ ఓ సినిమాని డైరెక్టర్ చేశాడు. ఇక ఈ సినిమాలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూలై 28న
ప్రేక్షకుల ముందుకు రానుంది.