IPL Auction 2025 Live

Kota Srinivas Rao: అనసూయ డ్రస్ మార్చాలి, అప్పుడే బాగుంటుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు, ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే అంటున్నానని వెల్లడి

అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు

Kota Srinivas Rao (Photo-Video Grab)

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ డ్రస్ కోడ్ పై ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు (Kota Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు.

ఇటీవలె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్‌ (Anasuya Bharadwaj Dress Code) నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్‌ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అనసూయ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తూనే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గ్లామర్‌ విషయంలో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది.

మా కొత్త అసోసియేషన్ ఏర్పాటుపై ప్రకాష్ రాజ్ క్లారిటీ, ‘మా’ ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా, ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని ప్రకాష్‌రాజ్ ప్యానల్ వెల్లడి

సోషల్‌ మీడియాలోనూ హాట్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోయే అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ తనదైన స్టైల్‌లో అలరిస్తుంది. అయితే ఆమె డ్రెస్సింగ్‌పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి నేటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఆ బట్టలేంటి అంటూ కొందరు నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఇ‍ప్పటికీ ఎదుర్కుంటున్నారు.



సంబంధిత వార్తలు

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర ఆగ్ర‌హం

Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన