MAA Elections 2021 Results: మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు, ఓటమి పాలైన ప్రకాష్ రాజ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోరులో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ఘన విజయం
ప్రకాష్‌రాజ్ ఓటమి చెందారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై (Prakash Raj) విజయం సాధించారు.
హోరా హోరీగా సాగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు (Vishnu Manchu) గెలుపొందారు. ప్రకాష్‌రాజ్ ఓటమి చెందారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై (Prakash Raj) విజయం సాధించారు. తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 400కి పైగా ఓట్ల భారీ మెజారిటీతో (MAA Elections 2021 Results) విష్ణు విజయం సాధించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు విజయం సాధించారు.
జనరల్ సెక్రటరీ పదవికోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్, మంచు విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్ నుంచి మాదాల రవి గెలుపొందారు. ఈసీ మెంబర్లలోనూ విష్ణు ప్యానెల్ కు చెందిన 8 మంది విజయం సాధించారు.
ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు, సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్, మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబుమోహన్ పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన హోరా హోరీ పోరులో శ్రీకాంత్ విజయం సాధించారు. మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు పోలయ్యాయి.
మంచు విష్ణు ప్యానెల్‌లో మాణిక్, హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో అనసూయ, సురేశ్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. మోహన్‌బాబు, మురళీ మోహన్, నరేశ్ తదితరులు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
మా'లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వారిలో ఓటు హక్కు ఉన్నది 883 మందికి ఉంది. నేడు జరిగిన పోలింగ్ లో పోస్టల్ బ్యాలెట్లతో సహా 665 ఓట్లు పోలయ్యాయి. అయితే, పలువురు నటీనటులు 'మా' ఎన్నికల్లో ఓటు వేయని విషయం వెల్లడైంది. వారిలో మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి అగ్రహీరోలు ఉన్నారు.
రవితేజ, అనుష్క, హన్సిక, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, సత్యదేవ్, అల్లు శిరీష్, శర్వానంద్, నాగచైతన్య, రానా, సుశాంత్, సునీల్, సుమంత్, నిహారిక, త్రిష తదితరులు ఓటు హక్కు వినియోగించుకోలేదని సమాచారం. షూటింగులు, ఇతర కారణాలతో వారు ఓటింగ్ కు రాలేకపోయినట్టు తెలుస్తోంది.
Check Here Maa Election Results :
Total Valid Votes – 883
Votes polled – 605
Postal Ballot – 60
Total Votes – 665
President: Manchu Vishnu won over Prakash Raj
Executive Vice President: Srikanth won over Babu Mohan
General Secretary: Actor Raghu Babu won over Jeevitha by 7 votes.
Treasurer: Siva Balaji won over Nagineedu
EC Members
Actress Anasuya (Prakash Raj panel)
Siva Reddy (Prakash Raj panel)
Kaushik (Prakash Raj panel)
Suresh Kondeti (Prakash Raj panel)
Poojitha (Vishnu panel)
Jayavaani (Vishnu panel)
J Shashank (Vishnu panel
Srininvasulu P (Vishnu panel)
Srilakshmi (Vishnu panel)
Manik (Vishnu panel)
Harinath Babu (Vishnu panel)
Vishnu Boppana (Vishnu panel)