Mahesh Babu: రియల్ హీరో అనిపించుకుంటున్న మహేష్ బాబు, చిన్నారుల ఆపరేషన్ల కోసం ఫౌండేషన్ ప్రారంభించిన సూపర్ స్టార్, ఇప్పటి వరకు 1200 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు
ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.
Hyderabad, March 05: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు (Heart Oparations) చేయిస్తూ ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కాపాడారు. అయితే తాను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు మహేష్ బాబు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు. ఇందులో ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్ కీలకంగా వ్యవహరించేవి. కాగా ఇప్పుడు మహేష్ చిన్నారుల ఆపరేషన్ల కోసం ఇప్పుడు రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలసి పనిచేయనుంది. ఇందుకోసం RCHIలో భాగంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చేపట్టిన ఈ హార్ట్ ఆపరేషన్ కార్యక్రమాలపై ఆయన ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీల్ లోనే కాదు రియల్ హీరో మహేష్ బాబు అంటూ కొనియాడుతున్నారు. అంతేకాదు తాను చేపట్టిన కార్యక్రమానికి ఆస్పత్రులు కూడా ఇలా హెల్ప్ చేయడం పట్ల మహేష్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో తన యాక్టివిటీస్ గురించి మహేష్ బాబు చెప్పారు. తన తనయుడు గౌతమ్ పుట్టినప్పుడు ఏర్పడ్డ సమస్య నుంచి ఈ ఆలోచన వచ్చిందన్నారు. పబ్లిసిటీ కోసం కాకుండా సేవాదృక్పథంతో ఆయన చేస్తున్న ఈ పనికి ప్రజలు కూడా ఫిదా అవుతున్నారు.