టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. హెర్నియాతో బాధపడుతున్న అతడికి అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమారు రెండు నెలల పాటు అతడు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతడు కోలుకున్నాడు. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్‌ రజనీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు' అని శ్రియ రాసుకొచ్చింది. దీనికి ఆండ్రియో చేతికి బ్యాండేజీలతో దర్శనమిచ్చిన ఫొటోలను జత చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శ్రియ హిందీలో 'దృశ్యం 2'లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)