కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మి.. రాత్రికి రాత్రే భార్య జంప్ అయిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) చోటు చేసుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించింది ఓ మహిళ.
ఇంటికి రూ.10 లక్షలు తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తానని భర్తను నమ్మించి రాత్రికి రాత్రే అదృశ్యం అయింది. ఆపై భార్య ఆచూకీ కోసం భర్త విచారించగా.. బరాక్‌పూర్ ప్రాంతంలో ఓ పెయింటర్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. రామ్..సీతా మీరెక్కడా?...కన్నీరు పెట్టిన ఎంపీ అవధేష్ ప్రసాద్, దళిత మహిళపై అత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్
కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి నిలదీయగా.. విడాకుల నోటీసులు పంపిస్తానని భార్య బెదిరింపులకు పాల్పడింది. మోసపోయానని గ్రహించి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. పశ్చిమబెంగాల్ రాష్టం హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో ఘటన జరిగింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)