గుక్కపట్టి ఏడ్చారు అయోధ్య ఎంపీ, ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్( MP Awadhesh Prasad). రామ్, సీతా మీరెక్కడున్నారు? అంటూ విలేకరుల సమావేశంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంపీ అవధేష్ ప్రసాద్.
దళిత మహిళపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు(Ayodhya MP cries). అయోధ్యకు సమీపంలో అత్యాచారం, హత్యకు గురైన 22 ఏళ్ల దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ముందు లేవనెత్తుతామని ఉద్వేగంతో చెప్పారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో అదృశ్యమైన 22 ఏళ్ల దళిత యువత శవం ఓ కాలువలో దొరికింది. ఒంటిపై బట్టలు లేకుండా ఉండగా , శరీరంపై తీవ్రమైన గాయాలు, విరిగిన ఎముకలు ఉన్నాయి. ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడి ఉండడగా శవాన్ని తరలించే సమయంలో ఆమె కాలు విరిగిందని గమనించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్ కాదంటూ మండిపాటు
SP MP Awadhesh Prasad cries in tears, asks Ram, Sita, where are you?
గుక్కపట్టి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. "రామ్, సీతా మీరెక్కడున్నారు?" అంటూ...
విలేకరుల సమావేశంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ అవధేష్ ప్రసాద్
దళిత మహిళపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్
అయోధ్యకు సమీపంలో అత్యాచారం, హత్యకు గురైన 22 ఏళ్ల దళిత మహిళ కుటుంబానికి… pic.twitter.com/dBs2uXfSQN
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)