Martin Luther King: ఓటీటీ లోకి సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్, ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసుకోండి

అతను హృదయ కాలేయం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్ గా అందరి హృదయాలను గెలుచుకున్నాడు.అయితే ఆయన నటించిన మరో తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్.

Martin Luther King (photo-X)

హీరోగా, కమెడియన్ గా తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఎప్పుడు ముందుండేది సంపూర్ణేష్ బాబు. అతను హృదయ కాలేయం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్ గా అందరి హృదయాలను గెలుచుకున్నాడు.అయితే ఆయన నటించిన మరో తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్.

తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా. ఈ చిత్రానికి రీమేక్ గా మార్టిన్ లూథర్ కింగ్ సినిమా  తెర మీదకు వచ్చింది. ఈ సినిమాను తమిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించగా.. తెలుగులో మాత్రం ఈ చిత్రానికి  పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించింది.

ఆమె  దర్శకత్వం వహించింది ఇదే  మొదటి సినిమా. గత నెల అక్టోబర్27 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు నుంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో సంపూ యాక్టింగ్ మాత్రం చాలా హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగానే.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా...ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యలో తాజాగా మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీ లాక్ చేసుకుంది.  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలైవ్ లో ఈ నెల 29 నుంచి మార్టిన్ లూథర్ కింగ్ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif