Devisri prasad: రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు.. ‘ఓ పరి’ ఆల్బమ్ వివాదంలో కేసు నమోదు.. అసలు ఏమైంది?

ఇటీవల ఆయన టీ సిరీస్‌ భూషన్‌కుమార్‌ నిర్మాణంలో ‘ఓ పరి’ అనే ఆల్బమ్‌ రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.

Devi sri prasad (Credits: Google)

Hyderabad, Nov 5: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై (Devisri prasad)సైబర్‌ క్రైమ్‌ పోలీసులు (Cyber crime)కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్‌ భూషన్‌కుమార్‌ (bhushan kumar)నిర్మాణంలో ‘ఓ పరి’ (o pari)అనే ఆల్బమ్‌ రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. పాట లిరిక్‌లో ‘హరేరామ హరేకృష్ణ’ (hare rama hare krishna) మంత్రాన్ని ఉపయోగించి చిత్రీకరించారని, ఆ పదాలను తొలగించాలని నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! పవిత్రమైన మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణితోపాటు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆ గీతంలోని మంత్రాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

షాక్.. ట్విట్టర్‌లో తీసివేతలు షురూ.. భారత్‌లో 80 శాతం మంది ఇంటికి!.. ఇప్పటికే ఈ-మెయిల్స్ అందుకున్న ఉద్యోగులు.. దేశంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయ సలహాతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో నటించిన ఈ ఆల్బమ్‌ను ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగులో ‘ఓ పిల్లా’(O pilla) పేరుతో విడుదల చేశారు. హిందీ వెర్షన్‌ను రణ్‌వీర్‌సింగ్‌ విడుదల చేశారు.



సంబంధిత వార్తలు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్

Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం