Bro Shooting: 'బ్రో' సెట్స్ పైకి పవన్ సూపర్ ఎంట్రీ... వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan), యువనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రో' సెట్స్ (BRO Sets) పైకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.

Bro (Credits: Twitter)

Hyderabad, May 21: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan), యువనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రో' సెట్స్ (BRO Sets) పైకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వెల్లడించింది. పవన్ రాకతో సెట్స్ పై వాతావరణం ఉత్సాహభరితంగా మారిపోయిందని పేర్కొంది. ఓ లగ్జరీ వాహనంలో సెట్స్ వద్దకు వచ్చిన పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికారు.

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్

లాల్చీ, పైజామా డ్రస్ లో..

లాల్చీ, పైజామా డ్రస్ లో ఉన్న పవన్ స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. బ్రో చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

NTR30 First Look: దేవర ఫస్ట్ లుక్‌ రిలీజ్, ఎన్డీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే, జూనియర్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కల్యాణ్‌రామ్