Unstoppable 2: బాలయ్య అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్...? హింట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఆహా వీడియో వైరల్

ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లు నిర్వహించిన బాలకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్టు సూచనప్రాయంగా వెల్లడైంది.

File.. Credits: Twitter

Hyderabad, Dec 13: టాలీవుడ్ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన వాక్చాతుర్యంతో, ఆహార్యంతో, హాస్యచతురతతో అన్ స్టాపబుల్ టాక్ షో (Unstoppable) రెండో సీజన్ ను (Second Season) కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. రాజకీయ నేతలను (Politicians) , స్టార్లను, ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ టాక్ షోను రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లు నిర్వహించిన బాలకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఆహ్వానించినట్టు సూచనప్రాయంగా వెల్లడైంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను షో ప్రసారమవుతున్న ఆహా ఓటీటీ విడుదల చేసింది.

విడుదలకు ముందే లీక్ అయిన అవతార్ 2.. టెలీగ్రామ్, టోరెంట్స్ లో లింక్స్ ప్రత్యక్షం.. మొత్తం చిత్రం ఆన్ లైన్లోకి!

అందులో బాలయ్య దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫోన్ చేయడం చూడొచ్చు. ఏం త్రివిక్రమ్... అన్ స్టాపబుల్ షోకు ఎప్పుడొస్తున్నావ్? అని బాలకృష్ణ అడగ్గా... మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సర్ అంటూ అవతలి నుంచి త్రివిక్రమ్ బదులిచ్చారు. దాంతో బాలయ్య స్పందిస్తూ, ఎవరితో రావాలో తెలుసుగా...! అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు.

జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. పరీక్షలు ఎప్పటి నుంచంటే?

అయితే అది పవన్ కల్యాణే అని ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకంటే, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. అందుకే బాలయ్య వీరిద్దరినీ కలిపి ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి.



సంబంధిత వార్తలు

Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

Pushpa 2 Benefit Show: పుష్ప 2 బెనిఫిట్ షో వివరాలు ఇవిగో, టికెట్ ధర 800 రూపాయలకు పైగానే, డిసెంబర్ 5న విడుదల కానున్న అల్లు అర్జున్ కొత్త మూవీ

Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌.. ప‌వ‌న్ సెల్ఫీ వైర‌ల్‌.. సంబురాలు చేసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌

Pushpa 2 Ticket Price Hike: 'పుష్ప‌2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంల‌కు అల్లు అర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif