Newdelhi, Dec 16: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్న 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)విడుదల చేసింది. దీని ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24-31 మధ్య జరుగుతాయి. 26న రిపబ్లిక్ డే నాడు పరీక్ష ఉండదు.
జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షల కోసం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ భాషల్లో ప్రశ్న పత్నాలు సిద్ధమవుతున్నాయి.
ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 2021, 2022 సంవత్సరాల్లో 12వ తరగతి, లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
JEE Main 2023 Exam Dates announced, 1st attempt in January, second in April.
I request @DG_NTA to Please conduct 1st Attempt of #JEEMains2023 in april Give fair chance to droppers✌️#jeemainsinapril #JEEMain2023 pic.twitter.com/UkzUd3Nj0U
— Siri (@supersiri20) December 15, 2022