Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌.. ప‌వ‌న్ సెల్ఫీ వైర‌ల్‌.. సంబురాలు చేసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌

ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌ లో జ‌రుగుతోంది.

Pawan Kalyan (Credits: Instagram)

Vijayawada, Dec 3: రాజ‌కీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్ర‌స్తుతం కొంత‌ గ్యాప్ దొర‌క‌డంతో 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌ లో జ‌రుగుతోంది. దీనిలో భాగంగా మేక‌ర్స్‌ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా పవన్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా 'హరిహర వీరమల్లు' సెట్స్ లో దిగిన సెల్ఫీని త‌న ఇన్‌ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

'పుష్ప‌2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంల‌కు అల్లు అర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

ఇన్‌ స్టాగ్రామ్ లో పవన్ ఏమన్నారంటే?

"చాలా బిజీగా ఉండే పొలిటికల్ షెడ్యూల్స్ నుంచి నా సమయంలో కొన్ని గంటలు ఎన్నాళ్ల‌ నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్ కి కేటాయించాను" అని ప‌వ‌న్ త‌న ఇన్‌ స్టా పోస్టులో పేర్కొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగితేలుతున్నారు. కాగా, ఈ సినిమా 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif