Allu Arjun in Pushpa 2 The Rule (Photo Credits: @alluarjunonline/ Instagram)

Vijayawada, Dec 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న తాజా చిత్రం పుష్ప‌2: ది రూల్‌ పై (Pushpa 2) అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు  టికెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల పెంపుతో పాటు బెనిఫిట్ షోల‌కు కూడా ఇప్పటికే అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు ఏపీ స‌ర్కార్ కూడా పుష్ప‌2 టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. అలాగే డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంట‌ల‌కు బెనిఫిట్ షోతో పాటు అర్ధ‌రాత్రి ఒంటి గంట షో కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌ర‌ను రూ. 800గా నిర్ణ‌యించింది. దీనికి జీఎస్‌టీ అద‌నం. ఈ షో చూడాలంటే మ‌ల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఏదైనా స‌రే రూ. 800 ప్ల‌స్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూవీ రిలీజ్ రోజైన డిసెంబ‌ర్ 5న ఆరు షోల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి

టికెట్ ధరలు ఇలా..

డిసెంబ‌ర్ 5 నుంచి 17 వ‌ర‌కు గ‌రిష్ఠంగా రూ. 200 (జీఎస్‌టీతో క‌లిపి) వ‌ర‌కు పెంచుకునేందుకు ఏపీ సర్కారు అనుమ‌తి ఇచ్చింది. మ‌ల్టీఫ్లెక్సుల్లో రూ. 200, సింగిల్ స్క్రీన్ల‌లో లోయ‌ర్ క్లాసుకు రూ. 100 (జీఎస్‌టీతో క‌లిపి), అప్ప‌ర్ క్లాసుకు రూ. 150 (జీఎస్‌టీతో క‌లిపి) వ‌ర‌కు పెంచుకోవ‌చ్చంది. అలాగే డిసెంబ‌ర్ 5 నుంచి 17 వ‌ర‌కు ఐదు షోల‌కు అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పుష్ప 2 విడుదల వేళ తిరిగి వెనక్కి రాలేవ్ పద్దతి మార్చుకో అంటూ నాగబాబు ట్వీట్, ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

అల్లు అర్జున్‌  ధన్యవాదాలు  

పుష్ప‌2 సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తి ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు  అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా థ్యాంక్స్ చెప్పారు. ఈ నిర్ణ‌యం తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌ ఎదుగుద‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న నిబ‌ద్ధ‌త‌ను తెలియ‌జేస్తుంద‌ని అన్నారు.