కొణిదెల నాగేంద్రబాబు తాజాగా వేసిన ట్వీట్‌తో మళ్లీ ఫ్యాన్ వార్ మొదలైంది. తాజాగా స్వామి వివేకానంద చెప్పాడంటూ ఓ కొటేషన్‌ను నాగబాబు షేర్ చేశాడు. నువ్వు వెళ్లే దారి, పద్దతి సరైనది కాదని అనుకో.. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకుని, రియలైజ్ అవ్వాలి.. లేదని అలానే చాలా దూరం వెళ్లావ్ అనుకో.. మళ్లీ తిరిగి వెనక్కి రాలేవు అనేది దాని అర్థం.

వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్

ఈ ట్వీట్ బన్నీకి కౌంటర్‌గా ఉన్నట్టుందే అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేయగా.. బన్నీ ఫ్యాన్స్ కూడా తిరిగి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి మీ మట్కాని ఇండస్ట్రీ హిట్ చేశారు కదా.. అని కౌంటర్లు వేస్తున్నారు. ముందు మీ మట్కాని చూసుకోండంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ తప్పు దారిలో వెళ్లినందుకు ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటూ బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా నంద్యాల ఎపిసోడ్ తరువాత బన్నీ మీద మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అందరికీ తెలిసిందే.

Nagababu Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)