Megastar Chiranjeevi: చిరంజీవికి అవార్డు రావడంపై ప్రధాని మోదీ ప్రశంసలు, చిరంజీవి ఒక విలక్షణమైన నటుడంటూ తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

తాజాగా అవార్డు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అవార్డుకు ఎంపికైనందుకు మెగాస్టార్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు.

chiranjeevi (photo-IANS)

టాలీవుడ్ ‍అగ్ర నటుడు చిరంజీవికి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 అవార్డు వచ్చిన సంగతి విదితమే. తాజాగా అవార్డు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అవార్డుకు ఎంపికైనందుకు మెగాస్టార్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు.

ట్వీట్‌లో ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. 'చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూరగొన్నారు'. అంటూ పోస్ట్ చేశారు. గోవాలో జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు మెగాస్టార్ ఎంపికయ్యారు. పనాజీలో ఆదివారం ప్రారంభమైన ఇఫి వేడుకలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి.



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం

Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)