Suresh Babu Clears Traffic: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సినీ నిర్మాత సురేశ్ బాబు.. వీడియో వైరల్

ఫిల్మ్ నగర్ వద్ద ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.

Credits: Video Grab

Hyderabad, Jan 3: హైదరాబాద్ (Hyderabad) లోని జూబ్లీహిల్స్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిల్మ్ నగర్ వద్ద ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు (Suresh Babu) తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రణలోకి తీసుకొచ్చారు.

అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ

ఒక సినీ ప్రముఖుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుండటం వాహనదారులను ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని వారు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సురేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు.

చంద్రబాబు ప్రచార పిచ్చికి పేదలు బలి, మరణాలన్నిటికి చంద్రబాబు బాధ్యత వహించాలి, బాధితులను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి రజిని