Rashmika Mandanna: నిషేధమా? అంతా అబద్ధం.. కర్ణాటకలో తనపై నిషేధం విధించారన్న వార్తలపై రష్మిక స్పందన
తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు.
Bengaluru, Dec 9: కన్నడ చిత్ర పరిశ్రమలో తనపై నిషేధం కొనసాగుతున్నదంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న (Rashmika Mandanna) స్పందించారు. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. 'కాంతార' (Kantara) విషయంలో తనపై కొందరు అత్యుత్సాహం చూపారని వెల్లడించారు. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం (Fake Publicity) జరుగుతున్నట్టు మండిపడ్డారు.
"కాంతార సినిమా చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. సినీ నటుల మధ్య ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయినా నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు. వృత్తిపరంగా ఏంచేస్తున్నానో చెప్పడం నా బాధ్యత. అంతవరకే. అంతేతప్ప నా పర్సనల్ విషయాలను అందరికీ చూపలేను. మెసేజ్ లు బయటికి విడుదల చేయలేను" అంటూ రష్మిక స్పష్టం చేశారు.