మాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.​ ప్రముఖ నిర్మాత జైసన్​ జోసెఫ్ కొచ్చిలోని​ తన అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి పట్ల మాలీవుడ్​ హీరోలు, నటులు, నిర్మాతలు, దర్శకులు సంతాపం తెలుపుతున్నారు.

చిన్నవయసులోనే ఆయనను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుంచాకో బోబన్ నటించిన 'జమ్నా ప్యారీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి థామస్ కె సెబాస్టియన్ దర్శకత్వం వహించారు. కుంచాకో బోబన్, గాయత్రి సురేష్, నీరజ్ మాధవ్ ఈ సినిమాలో నటించారు. గిరీష్ మనో దర్శకత్వంలో 2017లో విడుదలైన బిజు మీనన్ నటించిన ‘లవకుశ’ చిత్రాన్ని కూడా జైసన్ జోసెఫ్ నిర్మించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)