Vicky Kaushal, Rashmika Mandanna (Credits: X)

Hyderabad, Feb 11: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందన్న (Rashmika Mandanna) తాము జంటగా నటించిన తాజా చిత్రం 'ఛావా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. 'ఛావా' విడుదలకు ముందు విక్కీ, రష్మిక అమృత్‌ సర్‌ లోని స్వర్ణదేవాలయంలో సందడి చేశారు. గోల్డెన్ టెంపుల్ లో భక్తి శ్రద్దలతో కనిపించిన వీరిద్దరు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విక్కీ తెల్ల చికెన్ కుర్తాలో, రష్మిక పింక్ సూట్‌ లో కనిపించారు. ప్రస్తుతం వీరి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!

ఏసు బాయిగా రష్మిక

విక్కీ కౌశల్‌, రష్మిక జంటగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న సినిమా రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు.. ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ.. మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు