RRR Ugadi Poster: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్, కొమరం భీమ్‌, అల్లూరిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు పోస్టర్, అక్టోబర్ 13వ తేదీన సినిమా విడుదల

జ‌నాలు త‌మ‌ను పైకి ఎగ‌రేస్తుండ‌గా ఇద్ద‌రు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ పోస్ట‌ర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

RRR Ugadi Poster (Photo-Twitter)

బాహుబలి' సినిమాల త‌ర్వాత‌ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా యూనిట్ ఉగాది సందర్భంగా మ‌రో కొత్త పోస్టర్ ను విడుద‌ల‌ చేసింది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.

వారిద్ద‌రిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ లో చూపించారు. జ‌నాలు త‌మ‌ను పైకి ఎగ‌రేస్తుండ‌గా ఇద్ద‌రు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ పోస్ట‌ర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

'బాహుబ‌లి' వంటి భారీ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమా తీస్తుండ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా వదులుతూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.

Here's NTR Tweet

ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గ్రాండియర్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి అంతే గ్రాండ్‌గా సంగీతం సమరకూరుస్తున్నారు ఆయన. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా షేర్ చేసిన ఓ ఫొటో అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ‘మేము ఈ రోజు స్టూడియోలో మ్యాజిక్ చేశాము.. ఆర్ఆర్ఆర్ త్వరలో రాబోతుంది’ అంటూ రాజమౌళి, కీరవాణిలతో కలిసి దిగిన ఫొటోని విశాల్ షేర్ చేశారు. అంతే ఈ సినిమా సంగీతం పనులు శరవేగంగా సాగుతున్నాయంటూ ఆయన ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అల్లూరి సీతారామ రాజుగా ఉక్కు కండలతో, విల్లు ఎక్కుపెట్టి ఠీవీగా నిల్చున్న రామ్ చరణ్ లుక్ మాటలకందని అద్భుతం!

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా నటిస్తోంది. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ని, అజయ్ దేవ్‌గన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.