S. S. Rajamouli COVID-19 Positive: ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్, కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లోకి, కోలుకోగానే ప్లాస్మా దానం చేస్తామని తెలిపిన దర్శక ధీరుడు

ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా (SS Rajamouli COVID-19 Positive) నిర్దారణ అయింది. ఈ విషయాన్ని జక్కన్న (SS Rajamouli) స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా (Coronavirus) కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు.

SS Rajamouli (Photo Credits: Twitter)

దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా (SS Rajamouli COVID-19 Positive) నిర్దారణ అయింది. ఈ విషయాన్ని జక్కన్న (SS Rajamouli) స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా (Coronavirus) కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు. సోనూ సూద్ కొత్త మిషన్, జార్జియాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు, ట్విట్టర్ ద్వారా తెలిపిన సోనూ సూద్

కొన్ని రోజుల క్రితం నాకు, మా కుటుంబ సభ్యులకు కొద్దిగా జ్వరం వచ్చింది. దానంతట అదే తగ్గిపోయింది కూడా. కానీ ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. ఈ రోజు (బుధవారం) రిజల్ట్‌ లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సూచన మేరకు అందరం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నాం.. ఏ లక్షణాలు లేకుండా మేమందరం బాగానే ఉన్నాం. అన్ని సూచనలు పాటిస్తున్నాం. కరోనాలో నుంచి బయటపడి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాజమౌళి అన్నారు.

Check Out his Tweets :

యాంటీ బాడీస్ వృద్ధి చెందే సమయం కోసం ఎదురుచూస్తున్నామని, అనంతరం తాము పూర్తి స్థాయిలో కోలుకోగానే ప్లాస్మాను దానం చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి కుటుంబం కరోనా నుంచి క్షేమంగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేశారు. టాలీవుడ్‌లో కరోనా బారిన పడిన తొలి దర్శకుడు రాజమౌళినే కావడం గమనార్హం.

దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు. రాజమౌళి భార్య రమా రాజమౌళితోపాటు కూతురు ఎస్ఎస్ మయూఖ్యతో కలసి హైదరాబాద్‌లోని సొంతింట్లో ఉన్నారు.